Sunday 10 June 2012

విన్నపము

మిత్రులకు  నమస్కారములు.
ఇందు మూలముగా యావన్మందికి తెలియజేసే విన్నపము ఏమనగా?
మంత్రములతో ఆటలాడుకోనవద్దు. అవి ఆటంబాంబు లాంటివి. చాలా శక్తి వంతమైనవి. గురు ముఖముగానే నేర్వ వలెను. మీ ఇష్ట మోచ్చినట్లుగా పుస్తకములలో చూచి చదవకూడదు. పురశ్చరణ చేయకూడదు. ఉచ్ఛరించ కూడదు. చాలా ప్రమాదము.     తెలియని వాళ్ళు దానిని అనుసరించి దెబ్బ తింటారు. పైగా వారు చెప్పిన దాంట్లో చాలా తప్పులు వున్నవి. దోష భూయిష్టమైన వాటిని చదవ కూడదు. వాటిని గురువులు వుంటే సరి చేస్తారు. గురు ముఖతా మంత్రములను తీసుకోవలెను. స్వయముగా, శ్రద్ధ లేకుండా, ఆషామాషిగా మంత్రములను చదవకూడదు.  ఇవన్నీ వేద మంత్రములు. వేదములో చెప్పిన వన్నీ మంత్రములే. వాటిల్ని మనము అందరమూ గౌరవించాలి. అది మన మంచికే.
లేదంటే చాలా అనర్ధాలకు దారి తీస్తుంది.  మంత్రములను అలా సభా ముఖముగా తెలుప కూడదు. వాటి మర్యాదలను మనము కాపాడాలి.  చాలా తప్పులు మీరు చెప్పిన వాటిలో వున్నవి. వాటిల్ని ఉచ్చరించ కూడదు. దోషములు వుంటే ప్రాణములు లేనివిగా అవుతాయి మంత్రములు.
ప్రాణ శక్తి లోపించిన మంత్రములను ఉచ్చరించ కూడదు. వాటి వలన లక్ష్మి రాదు కదా, ఉన్నది పోతుంది. తస్మాత్ జాగ్రత్త.
మంత్రములలో ప్రాణ శక్తి వుంటుంది. బీజాక్షరములే  వాటి ప్రాణములు. వాటి ద్వార ఆయా దేవతలను బంధించి మన ముందు నిలబెడుతాయి మంత్రములు.
మంత్రములు మాత్రలు (tablets) కాదు. కోరినవారికి ఇవ్వడానికి. మాత్రలు కూడా డాక్టరు ప్రిస్క్రిప్షన్ లేనిదే వాడ కూడదు. అలాంటిది ఎంతో శక్తివంతమైనటువంటి మంత్రములను పూర్వాపరాలను విచారించ కుండా అలా ఎవరికంటే వారికి ఇవ్వకూడదు.  మంత్రాలకు చింత కాయలు రాలుతాయా అని అంటే? రాలుతాయి. చేసే వానిలో శ్రద్ధ వుంటే నిజంగా రాలుతాయి. ఇది సత్యం. ముమ్మాటికీ నిజం.
అంతగా మీకు శ్రద్ధ వుంటే గురువుల కోసము వెతకండి. గురువుల పాదములను పట్టుకొని బ్రతిమలాడండి, వారి అనుగ్రహము పొంది మంత్రములను పొందండి. గురువులు ఎక్కడో వుండరు. మనతో బాటు వుంటారు, మన చుట్టుపక్కలనే వుంటారు. వెతకండి, గుర్తు పట్టండి, ఉపదేశము పొంది మంత్రములను అనుష్టించండి. మంత్రములను గురు ముఖతః పొందవలెను.
గురు అనుగ్రహము లేనిదే ఏ మంత్రములనైనా ఉచ్చరించ కూడదు. పుస్తకముల ద్వారా, CD ల ద్వారా, ఇతరుల ద్వారానూతన మంత్రములను అనుష్ఠానం చేయ కూడదు. మనకు తెలిసినవిమనకు ఉపదేశము చేసినవి ఇతరులకు చెప్ప కూడదు. అవి ఫలించవు.

కావున దయచేసి నా భాధను అర్ధము చేసుకోండి. తప్పు దోవలోకి వెళ్లి దెబ్బ తినకండి అని చేతులు ఎత్తి మిమ్ములను ప్రార్ధిస్తున్నాను. దెబ్బ తిన్న వాళ్ళను చాలా మందిని చూసాను కాబట్టి చెబుతున్నాను.
మంత్రములతో ఆటలాడు కోనవద్దు.
మీ సందేహములకు, సమస్యలకు మంచి గురువులను ఆశ్రయించండి.
శుభమస్తు ..... కళ్యాణమస్తు..

మీ
భాస్కరానందనాథ


No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.