Wednesday 17 July 2013

శ్రీ మహాలక్ష్మి సాధన - 3


శ్రీ మహాలక్ష్మి సాధన - 3

వేదముల యందు ఈ సృష్టి ఏర్పడినది. కేవలం జననీ జనకుల కలయక వలననే ఈ సృష్టి ఏర్పడినది అని తెలుప బడినది. మరి ఆ స్త్రీ, పురుషులు ఎవరు? వారే ప్రకృతి పురుషుడు. ఒకటిగా వున్న పర బ్రహ్మం రెండుగా అయినది. అదే ప్రకృతి పురుషుడు. ఆది శక్తి, ఆది పురుషుడు. మరలా ఆది శక్తి మూడు శక్తులుగా సరస్వతి, లక్ష్మి, మహాకాళిగా ఆవిర్భవించినవి. పురుషుడు మూడు (త్రి) మూర్తులుగా అభివ్యక్త మయినాడు. పురుషుని గూర్చి వివరణ ఇస్తూ వేదము మనకు పురుష సూక్తము రూపములో ఆ విరాట్ పురుషున్ని వర్ణిస్తూ అందించినది. ఇక తండ్రి అయ్యగా మారినప్పుడు తల్లి వూరుకొంటు౦దా? తండ్రి పురుషుడు అయినట్లే తల్లి ప్రకృతి మాత అమ్మ అయినది. ఇలా పురుషుడు, ప్రకృతి మనకు తల్లిదండ్రులు అయి ఈ సృష్టిని ప్రారంభించినారు.

మానవుని శరీరం “పదార్ధముతో” ఏర్పడినది, దానిలో ఉన్న ఆత్మ పరమాత్ముని అనగా పురుషుని అంశగా శరీరములో ఆవహించి వున్నది. శరీరం ప్రకృతి, పంచ భూతములతో ఏర్పడినది.  ప్రకృతి, పురుషుల కలయక అనగా శరీరం మరియు ఆత్మ లు ఏకం అవ్వటం కారణముగా మానవునికి ఈ జీవితం ఏర్పడినది. ఆత్మ లేని శరీరమునకు జీవితము లేదు. మరి ఈ ఆత్మ ఎక్కడిది? ఆత్మ పురుషుని అంశగా మన శరీరములోకి ప్రవేశిస్తుంది. అనగా ఆత్మ శాశ్వతం, శరీరం అశాశ్వతం.

వేదములలో స్త్రీని ప్రకృతికి చిహ్నముగా తెలిపినారు. ఇందువలన స్త్రీలలో రుతుకాలములో అండము పుట్టి, 28 రోజులు పెరిగి, పురుషునితో కలయక జరగని యెడల నశించు చున్నది, నశించేడి అండము ప్రకృతికి చిహ్నము. కావుననే ప్రకృతిని స్త్రీ స్వరూపముగా వేదములు చెప్పినాయి. ఏ అండము అయితే 28 రోజులలో నశించి పోవుచున్నదో, ఆ నశించు అండము 29 రోజులు దాటి జీవించి ఉండలేదు, అలా జీవించి ఉండుటకు జీవం ఇచ్చేది పురుష బీజం, ఇదే అక్షర తత్వమున పురుషుడు. అనగా అండము పురుష తత్వముతో కలిసి పిండముగా మారుచున్నది. ఈ పిండము విశ్వము యొక్క ఆకృతిని పోలి స్త్రీ గర్భములో వృద్ధి అయి 9 నెలలు అనంతరము జన్మ తీసుకొంటున్నది. తొమ్మిది నెలలు మోసే తల్లి ప్రకృతి తత్వము గనుక ఆ తల్లికి నవరాత్రులు, నవ రాత్రి పూజ సంకేతముగా చెప్పబడినది.

పుట్టుకే లేని నారాయణుడు ప్రకృతి మాత అయిన జగన్మాతతో కలియుట వలననే నారాయణుడు కూడా శ్రీమన్నారాయణుడు అయివున్నాడు. అనగా పురుషుడు కూడా జగన్మాత వలననే శ్రీమంతుడు అగుచున్నాడు. కావున వేదము జగన్మాత అయిన ఈ శ్రీ నే శ్రీదేవిగా శ్రీసూక్తం ద్వారా స్తుతించినది. ప్రకృతి అయిన జగన్మాత శ్రీ లక్ష్మీ దేవిని 108 నామములతో స్తుతించుతూ బ్రహ్మ పురాణములో శ్రీ లక్ష్మీ సహస్రనామ స్త్రోత్రం చెప్పబడినది.

కావున శ్రిమహాలక్ష్మియే మూల ప్రకృతి అని, అందుకే ఆమె యొక్క మొదటి నామం ప్రకృతిం అని ప్రారంభించ బడినది. ఐశ్వర్యములను, మోక్షములను ఇచ్చేడి శ్రీ మహాలక్ష్మి ని కోలుచుటకై బ్రహ్మ పురాణంలో శ్రీ లక్ష్మీ సహస్ర నామములను వేదవ్యాస మహర్షి అందించినారు. ఆయన అందించిన వివరణ వలెనే శ్రీ మహా లక్ష్మియే మూల ప్రకృతి అని మానవాళికి తెలుపబడినది. ఆ మూల ప్రకృతి అయిన శ్రీ మహాలక్ష్మి ని సహస్ర నామాలతో పూజించిన ఆ తల్లి సంతసించి మన కోర్కెలను తీర్చును.  వేద వ్యాస మహర్షి శ్రీలక్ష్మి దేవిని ప్రకృతి గాను, శ్రీమన్నారాయణుడు పురుషుడు గాను తెలిపి వారిరువురు మధ్యనున్న అభేదత్వాన్ని తెలిపి శ్రీ లక్ష్మీ దేవిని “నిత్యానపాయిని” గా తెలిపినాడు. అనగా అన్ని సమయముల యందు  శ్రీమన్నారాయణుని విడవుకుండా ఉండునది అని అర్ధము. ప్రకృతి మూడు కోణములు, పురుషుడు మూడు కోణములు, రెండు త్రిభుజములు కలిసి ఆరు కోణములతో ఏర్పడిన యంత్రమే శ్రీ లక్ష్మీ యంత్రము.     షటకోణం.

శ్రీ మహాలక్ష్మీ పూజా విధానము మరి కొన్ని మంత్రములతో మరలా కలుస్తాము..

సశేషం .....

మీ

శ్రీ భాస్కరానంద నాథ



  

No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.